
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే బీఆర్‌ఎస్‌ను ప్రజలు పక్కనపెట్టారన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. హిందువుల పార్టీ తమదని చెప్పుకునే మోదీ అగర్‌బత్తీలను సైతం జీఎస్‌టీ నుంచి వదల్లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ పార్టీ అని.. వారి కోసం ఆహారభద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్‌టీ పేరిట రూ.54లక్షల కోట్లు దండుకున్న ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్‌ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 38వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని గ్యారంటీలకే రేవంత్‌రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు.