
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాజకీయాల్లోనూ పదవీ విరమణ ఉండాలి. పెరిగిన వయస్సు ఉద్యోగానికి పనికి రానప్పుడు రాజకీయాల్లో ఎలా పనికి వస్తుంది..? ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు అర్హతలు చూడాలి. ఐదేళ్లు పరిపాలించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ఆలోచించి ఓటు వేయాలి.
– పుల్లూరి శంకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు
ట్యాక్స్ విధించాలి
ఆలయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఉచితాలకు వినియోగించొద్దు. ఎవరి నుంచి వచ్చిన డబ్బులు వారి సంక్షేమం కోసమే వాడాలి. ఉచితాలతో ప్రజలు సోమరులుగా మారుతారు. కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచితాలు ఇవ్వాలనుకుంటే అభ్యర్థులు సొంతంగా డబ్బులు వెచ్చించాలి. ఎంపీ, ఎమ్మెల్యేలకు చెల్లించే వేతనాలకు కూడా ట్యాక్స్ విధించాలి. – బాల శ్రీరాములు, విశ్రాంత ఇరిగేషన్ ఇంజినీర్
అవగాహన ముఖ్యం
ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురి కావద్దు. అధికార యంత్రాంగఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం ప్రవాహాన్ని అరికట్టాలి. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన ఉండటం ముఖ్యం. రాజకీయనాయకులు స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికి,
నిస్వార్థంగా సేవ చేయాలి.
– దండనాయకుల రామారావు, విశ్రాంత ఉద్యోగి

