తడిసిన వరి పంటను చూపిస్తున్న ఈ రైతు పేరు మట్టూరి స్టాలిన్. కల్లూరు మండలం లింగాలకు చెందిన ఈయన 12 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎకరాకు రూ.50వేల చొప్పున రూ.6లక్షల పెట్టుబడి పెట్టాడు. తుపాన్‌తో పంట పూర్తిగా వాలడమే కాక నాని మొలకలు వచ్చాయి. మొలకలు రావడంతో ఎకరానికి 5 బస్తాల ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాడు. నాలుగు రోజుల క్రితం అధికారులు చూసి యాప్ ప్రారంభం కాలేదని చెప్పి వెళ్లిపోగా, మళ్లీ ఎవరూ రాలేదని వాపోయాడు. అసలు పరిహారం వస్తుందా, రాదా తెలియడం లేదని ఆవేదన చెందుతున్నాడు.


