తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● కేంద్రం నుంచి రూ.25వేల కోట్ల సాయం కేటాయించాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

● కేంద్రం నుంచి రూ.25వేల కోట్ల సాయం కేటాయించాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కొణిజర్ల: ఎల్‌నినో ప్రభావం కారణంగా పంటలు పండక రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యాన తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌చేశారు. కొణిజర్ల, తనికెళ్లలో బీళ్లుగా మారిన భూములను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం తనికెళ్లలో కూనంనేని మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన పంటలు చేతికి రాక నష్టపోయారని తెలిపారు. వరి, పత్తి ఎకరానికి రూ.30వేలు, మిర్చి, ఇతర పంటలు ఎకరాకు రూ.50 వేలే కాక బీడు భూములకు సైతం పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, వ్యవసాయ కూలీలకు కరువు భత్యంగా రూ.10 వేలతో పాటు రేషన్‌ బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువుపై దృష్టి పెట్టకుండా నిందారోపణలు చేసుకుంటున్నారని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు కరువు సాయం ప్రకటించాలన్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, దొండపాటి రమేష్‌, గడల భాస్కరరావు, స్వర్ణ రమేష్‌, ఏపూరి రామాంజనేయులు, తోట రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement