తల్లాడ: మండలంలోని రంగంబంజర వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఎనిమిమది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న సత్తుపల్లి డిపో బస్సును హైదరాబాద్ నుంచి తిరువూరు వైపు వెళ్తున్న వ్యాన్ అతివేగంగా ఢీకొట్టింది. ఘటనలో బస్సు భాగంగా దెబ్బతినగా ప్రయాణికలు కె.రమాదేవి, కె.బాలకృష్ణ, బానోత్ విజయరామరాజు, డి.పార్వతి, డి.చెన్నేశ్వర్‌రావు, డి.శివనాగలక్ష్మి, డి.సుజాతకు గాయాలయ్యాయి. ఈ తల్లాడ ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బస్సు ఢీకొని వృద్ధుడికి గాయాలు
తిరుమలాయపాలెం: ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధుడికి తీవ్ర గాయ్యాలయ్యాయి. మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన నారెడ్డి పాపిరెడ్డి సోమవారం ఉదయం సుబ్లేడు క్రాస్ వద్ద ఆటో ఎక్కేందుకు రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా ఖమ్మం నుంచి మరిపెడ వైపు వెళ్తున్న వరంగల్ డిపో ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో పాపిరెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆయన ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎనిమిది మందికి గాయాలు


