దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌ డే(ప్రజావాణి)లో భాగంగా ఆయన అదనపు కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై గతంలో అందిన ఫిర్యాదుల పురోగతిపై ఆరా తీశాక సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పారస్‌కుమార్‌, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని...

● ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్‌ నేతల తీరు కారణంగా సీపీఐ కౌన్సిలర్ల హక్కులకు భంగం కలిగిందని ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్‌, కౌన్సిలర్‌ దండి రంగారావు, నాయకులు మిడికంటి చిన్న వెంకటరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్‌రావు, వెంపటి సురేందర్‌, రామకోటి, నాగేశ్వరరావు, వీరభద్రం, బాబు పాల్గొన్నారు.

● కూసుమంచి మండలం తురకగూడెంలో కొమ్ము ఇందిరమ్మకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయించగా, దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులంతా మరణించారని స్థానికులు తెలిపారు. ఇంటికి చట్టబద్ధమైన హక్కుదారులు లేకపోతే మరొకరికి కేటాయించాలని కోరారు.

● చింతకాని మండలం వందనం గ్రామ చెరువుకు సాగర్‌ ఎడమ కాల్వ నీటి సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు, మత్స్య సొసైటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

పారదర్శకంగా ‘సర్‌’ ప్రక్రియ

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అందుబాటులో లేని, చిరునామా మారిన వారే కాక మృతుల ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నాకే తొలగించాలని తెలిపారు. సరైన విచారణ లేకుండా ఏ ఒక్క ఓటరు పేరు తొలగించొద్దని సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 1,75,841మంది అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు గాను 1,75,163 మంది విచారణ పూర్తిచేశామని తెలిపారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా ఇప్పటికీ 81వేల దరఖాస్తులుగా అందాయని పేర్కొన్నారు. ఈ వీసీలో కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం. ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement