వేంసూరు: ఎల్నినో ప్రభావంతో సాగునీరు, విద్యుత్ కొరత ఏర్పడుతుందని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు రానున్న యాసంగిలో వరి, మొక్కజొన్న కాకుండా తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని ప్రచారం చేస్తున్నారు. అయితే, సాగునీటి వసతి ఉన్న పలువురు రైతులు మాత్రం మొక్కజొన్న సాగుకే మొగ్గు చూపుతున్నారు. వానాకాలం పంటగా పెసర, మినుము, ఇతరత్రా సాగు చేసిన రైతులు కోతలు పూర్తవడంతో మొక్కజొన్న విత్తడం మొదలుపెట్టారు. ఇప్పటికే కొందరు రైతులు నాటిన విత్తనాల మొలకలు రాగా.. తక్కువ నీటితో సాగు చేసేలా డ్రిప్ పద్ధతి అవలంభిస్తున్నారు.


