9 నుంచి ‘కార్తీక’ పూజలు | - | Sakshi
Sakshi News home page

9 నుంచి ‘కార్తీక’ పూజలు

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

రామాలయ ఈఓ దామోదర్‌రావు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న సోమవారం సాయంత్రం 6 గంటలకు కార్తీక మాస ఆకాశదీపం, 16న మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, భస్మాభి షేకం, 23న రెండో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, చందనాభిషేకం, 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు, జ్వాలాతోరణం ఉంటాయని వెల్లడించారు. 29న ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణం, 30న మూడో సోమవారం శర్యారాభిషేకం, డిశంబర్‌ 7న నాలుగో సోమవారం పూజలు లక్ష బిల్వార్చన ఉంటుందని వివరించారు. కార్తీక మాసం సందర్భంగా పవిత్ర గోదావరి నదీతీరంలో ప్రతి సోమవారం నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 10 నుంచి డిసెంబర్‌ 8 వరకు రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ రామ సేవా మండపం వద్ద సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement