జీఓ 58, 59 ద్వారా అందిన దరఖాస్తుల విచారణ ఈనెల 15లోగా పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు.
ఈ రైతు పేరు బుర్ర కృష్ణ. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన ఈ రైతు ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాడు. అరకొరగా వర్షాలు కురిసినా అందుబాటులో ఉన్న నీటితో పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మొన్నటి అర్నబ్ తుపాన్‌తో కొంత పంట నేలవాలితే కూలీలతో నిలబెట్టించాడు. మళ్లీ ఇప్పుడు ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులను చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెబుతున్నాడు. పంట చేతికి వచ్చే సమయానికి వరుస తుపాన్లు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. వర్షం ఇలాగే కురిస్తే నష్టం తప్పదని వాపోయాడు.


