కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అంతర్ కళాశాలల హాకీ క్రీడాపోటీలు సోమవారం హనుమకొండలో నిర్వహించారు. ఈ పోటీలను కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి, స్పోర్ట్స్‌బోర్డు మాజీ సెక్రటరీ వై.వెంకయ్య ప్రారంభించారు. ఈ టోర్నీలో ప్రతిభ చూపిన 24 మంది క్రీడాకారులను సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టుకు ఎంపిక చేసినట్లు శాస్త్రి తెలిపారు. సెలక్టర్లుగా ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, యూసిన్, మహేశ్, అజయ్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మట్టెడ కుమార్ వ్యవహరించారు.
స్మార్ట్ ఫోన్‌తోనూ
కంప్యూటర్ స్కిల్స్
ఖమ్మంగాంధీచౌక్: ఉపాధికి ఉపయోగపడే కంప్యూటర్ కోర్సులను స్మార్ట్‌ఫోన్‌తోనూ నేర్చుకోవచ్చని విజయా ఏజెన్సీస్ బాధ్యులు నూతి విజయ తెలిపారు. ఇటీవల శిక్షణ పూర్తయిన చిల్డ్రన్స్ బ్యాచ్, టాలీ బ్యాచ్ విద్యార్థులకు రఘునాథపాలెం ఎస్‌ఐ ఎస్.డీ.షహీనా సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ట్రెయినర్ విజయ మాట్లాడుతూ పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల వారికి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ కోర్సులు బోధిస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థులు, మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం మామిళ్లగూడెం: పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ‘టాప్రా’ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఖమ్మం పీఎఫ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాక ఆయన మాట్లాడారు. కనీస పింఛన్ రూ.9వేలకు పెంచడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఆరునెలలకోసారి డీఆర్ చెల్లించాలని కోరారు. అంతేకాక పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం కల్పించాలని, పెన్షనర్లు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.5వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో నాయకులు టీ.ఎన్.రావు, ఏటుకూరి రామారావు, పిల్లలమర్రి వెంకటేశ్వరావు, భాస్కర్‌రెడ్డి, చావ చిట్టెమ్మ, పారుపల్లి ఝాన్సీ, తోకల బాబు, వాసిరెడ్డి మల్లికార్జునరావు, ఏడు నూతల రవికుమార్, స్వామి, శ్రీధర్, అంజయ్య, కే.వీ.రామారావు పి.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


