ములకలపల్లి: బయోచార్ తయారీకి ఉపయోగించే యంత్రం నిరుపయోగంగా మారింది. ములకలపల్లి రైతువేదిక ఆవరణలో దీన్ని ఓ మూలన పడేశారు. ఎండిన చెట్ల కొమ్మలు, పత్తి కట్టెను ఈ యూనిట్లో కాల్చి బొగ్గుగా తయారు చేస్తారు. ఆపై పొడిగా మార్చి ఎండిన ఆవుపేడ, ఆవు మూత్రం కలిపితే బయోచార్ సిద్ధమవుతుంది. దీన్ని సేంద్రియ ఎరువుగా పంటల్లో వినియోగిస్తే చీడపీడల నివారణతోపాటు అధిక దిగుబడి సాధ్యమవుతుంది. భద్రాద్రి జిల్లా కలెక్టర్గా జితేష్ వి.పాటిల్ ఉన్నప్పుడు ప్రతీ డంపింగ్ యార్డులో యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ములకలపల్లిలో ఏర్పాటుచేసిన యూనిట్ కలెక్టర్ బదిలీ కాగానే మూలన పడేయడం గమనార్హం.


