ఇండియన్‌ గ్లోరీ అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ గ్లోరీ అవార్డు ప్రదానం

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

తల్లాడ: లయన్స్‌ క్లబ్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన క్లబ్‌ ప్రతినిధి దారా శ్రీనివాసరావును ఇండియన్‌ గ్లోరీ అవార్డు వరించింది. కళా రత్న మూవీస్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో అవార్డు ప్రదానం చేశారు. సినీ హీరో సుమన్‌ అవార్డు అందజేసి శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. అవార్డు రావడం పట్ల తల్లాడ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కర్నాటి లక్ష్మారెడ్డి, కార్యదర్శి గులివిందుల సుధా నాయుడు, కోశాధికారి చల్లా రామాంజనేయ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

బైక్‌పై అత్తారింటికి వెళ్తూ..

●అదుపుతప్పి కింద పడి వ్యక్తి మృతి

సత్తుపల్లిటౌన్‌: అత్తారింటికి వెళ్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివునిపేటలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా.. సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన తురక రాంబాబు (40) ట్రాక్టర్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి తుంబూరు నుంచి సిద్ధారంలోని అత్తారింటికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యలో సదాశివునిపేట గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం రాశులు కుప్పను చీకట్లో కనిపించలేదు. దీంతో రాశులపై నుంచి వెళ్లడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పుల్లమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా ప్రమాదానికి ధాన్యపు రాశులే కారణమని, వాటి యజమానులు తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సై అశోక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement