మండలంలోని వివిధ గ్రామాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యాన ప్రభుత్వ మద్దతు ధరకు మించి మిల్లర్లు కొనుగోలు చేస్తుండడంతో రైతులు బారులు దీరుతున్నారు. ఆదివారం మండలంలోని బైరవునిపల్లి, సింగారెడ్డిపాలెం, చెరువుమాధారం తదితర గ్రామాలకు చెందిన రైతులు 40కి పైగా ట్రాక్టర్లతో ఓ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చారు. తొలుత పచ్చి ధాన్యాన్ని సైతం మంచి ధరతో కొనుగోలు చేసిన మిల్లర్లు రెండు రోజుల క్రితం సిండికేట్గా మారి ధర తగ్గించారు. అయితే, ఆదివారం మాత్రం హెచ్ఎంటీ క్వింటా రూ.3,800, చింట్లు క్వింటా రూ.4,150 చొప్పున కొనుగోలు చేయడంతో రైతులకు ఉపశమనం కలిగినట్లయింది.
– నేలకొండపల్లి


