ఖమ్మంగాంధీచౌక్: గుజరాత్ రాష్ట్రం ఏక్తా నగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో ఖమ్మం ఎకో క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఎకో–క్లబ్ ఎన్విరాన్‌మెంటల్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కడవెండి వేణుగోపాల్, అరుణకుమారి ఇందులో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేడుకల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ ఆశయాలు దేశ సమైక్యతకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. జాతీయ ఐక్యతా ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
అండర్–17 జిల్లా
అథ్లెటిక్స్ జట్లు సిద్ధం
ఖమ్మం స్పోర్ట్స్: అండర్–17 అథ్లెటిక్స్ బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.చిన్ని వెల్లడించారు. ఈ జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. బాలుర జట్టుకు ఆర్.మోహన్, ఏ.నాగరాజు, పి.జితేందర్, ఎస్.విజయరామ అరవింద్, ఎం.చరణ్ నాయక్, ఎస్.శ్రీకాంత్, జె.వినీల్, డి.అవినా ష్, కె.వాసు, కె.గోపాలకృష్ణ, ఎం.సాయిభరత్, కె.దిలీప్, జె.కార్తీక్, ఎన్.ఫ్రాంక్లిన్, బి.చరణ్, కె.ఆనంద్, ఎం.వివేకవర్థన్, పి.అభిరాం దొర, ఎం.అభి, పి.అజయ్, కె.ఆనంద్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. అలాగే, బాలికల జట్టుకు వై.శృతిహాసన్, ఎం.ప్రవళిక, జి.ప్రసన్నలక్ష్మి, టి.తేజశ్రీ, ఏ.వైష్ణవి, ఎం.సాయిదీపిక, పి. స్వప్న, వేదార్షిని, సీహెచ్.మీనాక్షి, ఏ.గౌరీప్రియ, పి.సంగీత, బి.మైథిలి, ఎం.శాంతి, భువనేశ్వరి, ఈ.వినీల, సీహెచ్. కార్తీక, కె. నవ్య, ఈ.విజయదుర్గ, ఎం.హర్షిణి ఎంపికయ్యారని తెలిపారు.
వివాదాస్పద స్థలాన్ని
పరిశీలించిన డీఐఎస్
పెనుబల్లి: పెనుబల్లి – కల్లూరు మండలాల మధ్య వివాద భూమి హద్దులను ఆదివారం జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే(డీఐఎస్) నాగభూషణం పరిశీలించారు. పెనుబల్లి మండలం తాళ్లపెంట రెవెన్యూ, కల్లూరు మండలం గోకవరం రెవెన్యూ మధ్య కర్రలపాడు, ఎర్రబంజర, బత్తులపల్లి గ్రామాల్లో భూములు గతంలో తాళ్లపంట రెవెన్యూలో ఉండగా.. ఇప్పుడు గోకవరం రెవెన్యూలో చూపిస్తున్నారంటూ వివాదం నెలకొంది. ఈమేరకు రైతులు ఇటీవల కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్‌యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యాన ఆదివారం డీఐఎస్ నాగభూషణం, సర్వేయర్లతో కలిసి హద్దులపై స్థానిక రైతులతో చర్చించారు. రికార్డుల ఆధారంగా సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సర్వేయర్లు ఈ.శ్రీనివాసరావు, ఈశ్వరి, స్వప్న, ప్రవీణ్, జీపీఓ సత్యవాణి పాల్గొన్నారు.
వాతావరణ మార్పులపై అవగాహన
ఇల్లెందురూరల్: ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై రైతులు అవగాహన పెంచుకుని, అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య సూచించారు. ఇల్లెందు మండలం ధనియాలపాడులో ఇఫ్కో, ఫ్యాక్ట్ సంస్థలు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయడమే కాక సరైన యాజమాన్య పద్ధతులు పాటించి, సాంకేతికతను వినియోగించాలని తెలిపారు. అనంతరం పలువురు రైతులకు నానో యూరియా, నానో డీఏపీ, జింక్‌తో పాటు 20 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ధనియాలపాడు సర్పంచ్ సనప సావిత్రి, ఉపసర్పంచ్ అంజనేయులుతో పాటు ఈసం భద్రయ్య, నర్సయ్య, ఏపె వెంకటేశ్వర్లు, ఈసం కొమురమ్మ, జబ్బ అంజయ్య, సనప సురేష్, నాగార్జున, రామకృష్ణ పాల్గొన్నారు.


