ఖమ్మం మామిళ్లగూడెం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రభుత్వ భూములను అమ్మడమే కాక సహజ వనరులను పక్కదారి పట్టిస్తూ దోపిడీకి తెరతీసిందని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించా రు. ఖమ్మంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టుల పేరుతోనే కాక 22ఏ భూముల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ వ్యవహారంలోనూ రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. కేవలం రూ.22 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి 72 ఎకరాల విలువైన భూమిని ఎకరాకు కేవలం రూ.25లక్షల చొప్పున కట్టబెట్టారని పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టే వరకు పోరాడుతామని తెలి పారు. అలాగే, సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీస్తామని చెప్పారు. అనంతరం 51వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
●ఖమ్మంఅర్బన్: ఖమ్మం 9వ డివిజన్ రోటరీనగర్‌లో బీజేపీ నాయకుడు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు ఉదయ్‌ప్రతాప్, రుద్ర ప్రదీప్, నున్న రవికుమా ర్, వీరల్లి రాజేష్, గుత్తా వెంకటేశ్వరరావు, అల్లిక అంజయ్య, మంద సరస్వతి, రీగన్, సురేష్, కృష్ణ, సాయిరాం, రుద్రగాని మాధవ్, శ్రీలక్ష్మీరెడ్డి, గడిల నరేష్, మహేందర్‌సింగ్, వెంకటనారాయణ, ఈవీ రమేష్, నీలిమ, ముత్యం, రాము పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి


