సమసమాజ స్థాపనతోనే అమరవీరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

సమసమాజ స్థాపనతోనే అమరవీరులకు నివాళి

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

ఖమ్మం మయూరిసెంటర్‌: పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం, రైతాంగం, ప్రజలు ఐక్యంగా పోరాడి దోపిడీ లేని సమసమాజాన్ని స్థాపించుకోవడం ద్వారా అమరవీరులకు నివాళి అర్పించాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన అమరవీరుల సంతాప సభలో ఆయన అమరవీరుల స్థూపం వద్ద ఎర్రజెండా ఆవి ష్కరించి మాట్లాడారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్య మ చరిత్రలో స్వాతంత్య్రం, భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. భగత్‌సింగ్‌, అల్లూరి సీతా రామరాజుతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ మౌలిక వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడమే కాక, ‘సర్‌’ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లు అక్రమంగా తొలగించారని విమర్శించారు. ఈమేరకు అమరుల స్ఫూర్తితో కార్యకర్తలు పోరాడాలని కోరా రు. మాస్‌లైన్‌, అనుబంధ సంఘాల నాయకులు ఝాన్సీ, సీహెచ్‌.శిరోమణి, కె.శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, నామాల ఆజాద్‌, లెనిన్‌, బొల్లి కొమరయ్య, రఘు, మురళి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement