● ఆర్‌జేడీ కృష్ణవేణి
ఖమ్మంమయూరిసెంటర్: పోషన్ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ కృష్ణవేణి ఉద్యోగులకు సూచించారు. ఖమ్మంలోని సఖి వన్ స్టాప్ సెంటర్‌ను శనివారం పరిశీలించిన ఆమె రికార్డులు పరిశీలించడమే కాక ఆశ్రయం పొందుతున్న బాధిత మహిళలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం శిశుగృహ, బాలల సదనాన్ని సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న వసతులు, పోషణప వివరాలు తెలుసుకున్నారు. అలాగే, బాలల సదనంను కూడా పరిశీలించిన ఆర్‌జేడీ నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పాలేటి ప్రమీల, జిల్లా బాలల సంక్షేమ అధికారి విష్ణువందన, ఉద్యోగులు ముత్తయ్య, నవ్య, యశోద, శ్రీనివాస్, అరుణ, ఎస్.డీ.సమ్రీన్, స్వరూపరాణి, అంజని, సరిత, బాబు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యాన కబడ్డీ, రన్నింగ్, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు నిర్వహించగా జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 75 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బాజోజు ప్రవీణ్‌కుమార్, పీఈటీలు పారిజాతం, సునీత, రాజకుమారి, శివ, మాలతి పాల్గొన్నారు.


