ఖమ్మం వైరారోడ్: రాష్ట్రప్రభుత్వం పాలనను పూర్తిగా గాలికొదిలేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి మాట్లాడారు. సీఎం సమా మంత్రులు తరచూ ఢిల్లీ బాట పడుతుండడంతో ఇక్కడ పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. మరోపక్క బూటకపు వాగ్దానాలు, ప్రధాన ప్రతిపక్షంపై తప్పుడు ప్రచారం చేయడం తప్ప హామీల అమలుపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ భూములను సేకరించి పెడితే ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం ఆగమాగం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుండాల కృష్ణ, రాకేష్‌రెడ్డి, ఉప్పల వెంకటరమణ, నరేందర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర


