ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ● టేకులపల్లి కేసీఆర్‌ టవర్స్‌లో ఆకస్మిక తనిఖీలు

జాతీయ ఐక్యతా దినోత్సవం

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ● టేకులపల్లి కేసీఆర్‌ టవర్స్‌లో ఆకస్మిక తనిఖీలు

ఖమ్మంఅర్బన్‌: ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడమే కాక నేరాల నియంత్రణలో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కనెక్ట్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఖమ్మంలోని టేకులపల్లిలోని కేసీఆర్‌ టవర్స్‌ ప్రాంతంలో గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యాన శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన 286 మంది పోలీసు ఉద్యోగులు పాల్గొనగా, ప్రతీ ఇంటినీ తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈక్రమాన సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు, సేవిస్తున్న 12 మందిని గుర్తించడంతోపాటు ముగ్గురు చోరీ నిందితులు, ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అంతేకాక మణిదీప్‌ వద్ద 15 గ్రాముల గంజాయి లభించడంతో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్థానికుల విజ్ఞప్తి మేరకు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయడంతో పాటు బెల్ట్‌షాపుల కట్టడికి ఎకై ్సజ్‌ శాఖతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. అడిషనల్‌ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, మహేష్‌, ఫణీందర్‌, సర్వర్‌, సీఐలు సాదిక్‌ పాషా, చిట్టిబాబు, కరుణాకర్‌, శివప్రసాద్‌, నాగరాజు, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంక్రైం: దేశ తొలి ఉపప్రధాని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలంటూ సీపీ సునీల్‌దత్‌ ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్‌ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏసీపీలు సాంబరాజు నర్సింహారావు, ఏఓ కళావతి, ఆర్‌ఐ కామరాజు, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హేమనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement