● పది ఉమ్మడి జిల్లాల నుంచి హాజరైన మహిళా జట్లు ● పోటీలను ప్రారంభించిన డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి 48వ జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల వారీగా జట్లు హాజరుకాగా, పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా క్రీడారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో వసతులు కల్పించడమే కాక మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలను నిర్మించామన్నారు. వీటి ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా జిల్లాలో తొలిసారి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ హ్యాండ్‌బాల్‌లో జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, క్రీడా సంఘాల ప్రతినిధులు ఎన్.ఉప్పల్‌రెడ్డి, బి.గోవిందారెడ్డి, వీవీఎస్‌ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, వరంగల్ జట్ల శుభారంభం
రాష్ట్ర స్థాయి టోర్నీలో తొలిరోజు లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జట్టు రంగారెడ్డిపైనే కాక నల్లగొండ జట్టుపై విజయం సాధించింది. ఇక వరంగల్ జట్టు నిజామాబాద్ జట్టుతో పాటు మెదక్, హైదరాబాద్ జట్లపైనా గెలిచింది. అంతేకాక మహబూబ్‌నగర్ జట్టు మెదక్, నిజామాబాద్ జట్లపై ఆదిలాబాద్ జిలాల జట్టు కరీంనగర్‌పై విజయం సాధించింది.


