హత్యలతో ఎర్రజెండాను అణచివేయలేరు.. | - | Sakshi
Sakshi News home page

హత్యలతో ఎర్రజెండాను అణచివేయలేరు..

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● రామారావు హత్య కేసులో నిజమైన నేరస్తులను పట్టుకోవాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

● రామారావు హత్య కేసులో నిజమైన నేరస్తులను పట్టుకోవాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

చింతకాని: పేదప్రజల విముక్తి, దోపిడీ వ్యవస్థ నిర్మూలన, సమసమాజ స్థాపనే కమ్యూనిస్టు ఉద్యమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌ 31న హత్యకు గురైన చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు సామినేని రామారావు ప్రథమ వర్ధంతి సభ శనివారం రాత్రి గ్రామంలో నిర్వహించారు. ఈ సభకు హాజరైన జాన్‌వెస్లీ తొలుత సామినేని విగ్రహానికి నివాళులర్పించాక మాట్లాడారు. పేదలు, రైతులు, శ్రామిక వర్గాల పక్షాన నిరంతరం పోరాడిన నాయకుడు రామారావు అని కొనియాడారు. కాగా, సీపీఎం ఇతర రాజకీయ పార్టీల మాదిరి అధికారం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయదని, అధికారంలో కాంగ్రెస్‌ ఉన్నా, బీఆర్‌ఎస్‌ ఉన్నా పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ధైర్యం కమ్యూనిస్టు నాయకత్వానికి ఉందని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులను హత్య చేసినా ఉద్యమం ఆగలేదని, రామారావు హత్యతోనూ ఇక్కడ ఎర్రజెండా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రామారావు హత్యకు రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయంటున్న పోలీసులు అందుకు ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కొందరిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించగా.. నేరం ఒప్పుకోవాలంటూ వారిని బలవంతం చేయడం వెనుక కూడా భట్టి హస్తం ఉందని విమర్శించారు. కాగా, రామారావు హత్య కేసులో అసలు దోషులను వెలికితీసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి సిట్‌ ఏర్పాటుచేయాలని జాన్‌వెస్లీ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఇంకా ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, నాయకులు మడిపల్లి గోపాల్‌రావు, పొన్నం వెంకటేశ్వరావు, లక్ష్మి, బండి రమేష్‌, బండి పద్మ, కల్యాణపు వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, కిలారు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement