ప్రభుత్వ నిర్దేశిత ధరలకే బియ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్దేశిత ధరలకే బియ్యం

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను శనివారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 26 కిలోల బస్తాకు బీపీటీ, కేఎన్‌ఎం రకమైతే కిలో రూ.66చొప్పున, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా కిలో రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్‌ కిలో రూ.79 ధర ప్రామాణికంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు ధరల వివరాలతో బ్యానర్‌ను రైస్‌ మిల్లర్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ వ్యాపారులు షాపుల్లో ప్రదర్శించాలని సూచించారు. ధరలు పెంచినట్లు తేలితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి

చందన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement