ఖమ్మంవ్యవసాయం: అర్నబ్ తుపాన్ ధాటికి ఏపీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అతలాకుతమైంది. ఈమేరకు తెగిపడిన లైన్లు, నేలకొరిగిన స్తంభాలను పునరుద్ధరించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తెలంగాణ నుంచి పలువురు విద్యుత్ ఉద్యోగులను పంపించారు. ఈమేరకు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం ఖమ్మం సర్కిల్ నుంచి 399 మంది సిబ్బంది 42 బృందాలుగా ఏపీకి బయలుదేరారు. అవసరమైన వాహనాలు, సామగ్రితో సిబ్బంది వెళ్లగా, జిల్లాకు చెందిన పలువురు విద్యుత్ కాంట్రాక్టర్లు కూడా తమ సిబ్బంది, యంత్ర పరికరాలు బయలుదేరారు. కాగా, సిబ్బంది, కాంట్రాక్టర్లను సమన్వయం చేసేలా ఇంజినీరింగ్ అధికారులను కూడా పంపించినట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు.
399 మంది సిబ్బందితో తరలిన
42 బృందాలు


