ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తి
పుంజుకుంటున్న బొగ్గు ఉత్పత్తి
● సింగరేణి వ్యాప్తంగా 100 శాతం బొగ్గు ఉత్పత్తి ● 123శాతంతో అగ్రస్థానాన మందమర్రి, ఆతర్వాత 118 శాతంతో సత్తుపల్లి ● ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 96శాతం ఉత్పత్తి
రుద్రంపూర్: సింగరేణి వ్యాప్తంగా 12ఏరియాలకు గాను అక్టోబర్‌లో నిర్దేశించిన 51,19,864 టన్నుల బొగ్గు ఉత్పత్తికి లక్ష్యానికి 51,19,865 లక్షల టన్నుల ఉత్పత్తి ద్వారా వంద శాతం నమోదైంది. ఆర్థిక సంవత్సరం గడిచిన ఏడు మాసాల్లో పరిశీలిస్తే 31.98 మిలియన్ టన్నుల లక్ష్యానికి 30.77 మిలియన్ టన్నుల(96శాతం) ఉత్పత్తి సాధించింది. సింగరేణి వ్యాప్తంగా 20 భూగర్భ గనుల్లో గడిచిన ఏడు మాసాల్లో 3.26 మిలియన్ టన్నులకు గాను 2.37 మిలియన్ టన్నులు(73శాతం), 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో 28.72 మిలియన్ టన్నులకు 28.40 మిలియన్ టన్నులు(96శాతం) ఉత్పత్తి సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఐదు ఏరియాల్లో వంద శాతం
సంస్థ వ్యాప్తంగా అక్టోబర్‌లో వంద శాతం ఉత్పత్తి నమోదైనా ఏరియాల వారీగా పరిశీలిస్తే 12కు గాను ఐదు ఏరియాల్లోనే వంద శాతం నమోదైంది. మందమర్రి ఏరియా 123శాతంతో మొదటి స్థానాన నిలవగా సత్తుపల్లి ఏరియా 118శాతంతో రెండో స్థానం దక్కించుకుంది. ఇక మణుగూరు ఏరియాలో 115శాతం, కొత్తగూడెం ఏరియా 109, ఆర్జీ–1 ఏరియా 108 శాతం సాధించాయి. మిగతా ఇల్లెందు ఏరియాలో 63 శాతం, బెల్లంపల్లి ఏరియా 90శాతం, శ్రీరాంపూర్ ఏరియా 95శాతం, ఆర్జీ–2 ఏరియా 95శాతం, ఆర్జీ–3 ఏరియా 89శాతం, భూపాలపల్లి ఏరియా 80 శాతం, అడ్రియాల ప్రాజెక్ట్ 13శాతానికి పరిమితమయ్యాయి.
ఏరియా శాతం
మణుగూరు 135
సత్తుపల్లి 131
బెల్లంపల్లి 107
ఆర్జీ–2 101
మందమర్రి 72
ఆర్జీ–1 70
ఏరియా శాతం
ఆర్జీ–3 68
ఇల్లెందు 66
భూపాలపల్లి 52
కొత్తగూడెం 64
శ్రీరాంపూర్ 44
అడ్రియాల 22
గతంలో కంటే కొత్తగూడెం ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పుంజుకుంటోంది. వీకేసీఎంకు స్టేజీ–2 అనుమతులు వచ్చిన నేపథ్యాన మరో రెండు రెండు నెలలో ఉత్పత్తి ఇంకో లక్ష టన్నులు పెరిగే అవకాశం ఉంది. పీవీకే–5లో కూడా ఎల్‌హెచ్‌డీల ద్వారా 100శాతం ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నాం.
– వెంకటేశ్వరరావు, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)


