ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోన్ డిగ్రీ, పీజీ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 4నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం వైరా రోడ్డులోని డెక్కన్ క్రికెట్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశా ల నిర్వహణలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో ఖమ్మం జోన్ జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.వెంకన్న వ్యవహరించనుండగా, క్రీడాకారులు వివరాల కోసం 94412 36384 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినికి బంగారు పతకం
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగా ణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి జర్పుల కావ్య కేయూ నుంచి బంగారు పతకం సాధించింది. 2022–25 విద్యాసంవత్సరంలో బీఎస్‌సీ ఎంబీజెడ్‌సీ పూర్తిచేసిన ఆమె పతకానికి ఎంపికై ంది. వచ్చేనెల 28న కాకతీయ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో బంగారు పక తం అందుకోనుంది. కారేపల్లి మండలం వెంకటియా తండాకు చెందిన కావ్యను ప్రిన్సిపాల్ కె.రజని, అధ్యాపకులు అఽభినందించారు.
కండక్టర్‌ను పరామర్శించిన కూనంనేని
ఖమ్మంమయూరిసెంటర్: అశ్వాపురంలో కదులుతున్న బస్సు నుంచి ప్రయాణికురాలు తోసేయగా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో కండక్టర్ జి.ప్రవళికను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో ఆమెను పరామర్శించిన కూనంనేని, చికిత్సపై వైద్యులతో మాట్లాడడమే కాక ఆమె తల్లికి ఽధైర్యం చెప్పారు. సీపీఐ, ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రవళికకు అండగా ఉంటాయని తెలిపారు.
నీలాద్రి ఆలయం ఈఓగా మధుపాయ్ చౌదరి
పెనుబల్లి: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నీలాద్రీశ్వర ఆలయ ఈఓగా మధుపాయ్ చౌదరి నియమి తులయ్యారు. ప్రస్తుత ఈఓ రజినికుమారి శనివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఖమ్మం మైసమ్మ గుడి ఈఓ మధుపాయ్‌ను నియమించగా, ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
షాప్‌లకు 3న వేలంపాట
కార్తీకమాసం సందర్భంగా నీలాద్రిశ్వర ఆలయంలో షాప్‌ల ఏర్పాటుకు నవంబర్ 3న వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. లడ్డూ, పులిహోర, కొబ్బరికాయలు, పూజద్రవ్యాలు అమ్మడంతో పాటు కొబ్బరిచిప్పలు, తలనీలాలు పోగు చేసుకోవడం, సైకిల్ స్టాండ్, కూల్ డ్రింక్స్ షాపు నిర్వహణకు ఆసక్తి ఉన్న వారు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.
విద్యార్థినులు
అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంలీగల్: అసభ్యకరమైన ప్రవర్తనలను ఎదుర్కొనేలా విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి సూచించారు. ఖమ్మం నయాబజార్ పాఠశాలలో హెచ్‌ఎం చావా ఉషారాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుటుంబం, పాఠశాలలో లేదా బయట ప్రదేశంలో ఎవరైనా తపేఉ్పడు వ్యవహరిస్తే ఆ సమాచారాన్ని ధైర్యంగా చెప్పాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్సై కొండలరావు, ఉపాధ్యాయులు మాధవరావు, సురేష్, బాబు, గోపాల, లక్ష్మి, గురువమ్మ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


