రేపటి నుంచి ఓపెన్‌ డిగ్రీ తరగతులు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఓపెన్‌ డిగ్రీ తరగతులు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

ఖమ్మం హకారనగర్‌: డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ తరగతులు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఆదివారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయని ఎస్‌ఆర్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.వీరన్న తెలిపారు. ఈమేరకు అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నవంబర్‌ 5వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు.

ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఖమ్మంసహకారనగర్‌: ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఐఈఓ రవిబాబు సూచించారు. ఖమ్మం శాంతినగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌లు, వసతులు, విద్యార్థుల మార్కులను పరిశీలించి మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, వారి ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ ఆర్‌.గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కేజీబీవీలో డీఈఓ తనిఖీ

బోనకల్‌: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో డీఈఓ డి.వాసంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని పరిశీలించాక ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆతర్వాత నాబార్డ్‌ నిధులతో చేపట్టే డైనింగ్‌హాల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన డీఈఓ, డీఈ నాగేశ్వరావుతో చర్చించారు. డీఈఓ దామాల పుల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రయోగాలతోనే విజ్ఞానం

ఖమ్మంసహకారనగర్‌: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాల ద్వారా బోధిస్తే విజ్ఞానం పెరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలవాల నాగేశ్వరరావు తెలిపారు. డీఎస్సీ–2024లో నియమితులైన సైన్స్‌ ఉపాధ్యాయులకు ఖమ్మం రిక్కాబజార్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ప్రయోగాలపై జేవీవీ ఆధ్వర్యాన శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవడం వల్ల విజ్ఞానశాస్త్రంపై ఆసక్తితో పాటు శాసీ్త్రయ దృక్పథం పెరుగుతుందన్నారు. అనంతరం కేవీకే.శర్మ, కె.రామారావు, బి.హనుమ, ఈ.వెంకటేశ్వర్లు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీఎంఓ ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఆర్‌.శ్రీనివాసరావు, హెచ్‌ఎంలు వి.శాంత, మాధవరావు, జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ.రమేష్‌, నాగేందర్‌తో పాటు మోహన్‌, సూర్యనారాయణ, శ్రీరాములు, పి.రామకృష్ణ, టి.రామకృష్ణ, రాఘవయ్య, డాన్‌ బాస్కో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement