అసలు హంతకులను కాపాడేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

అసలు హంతకులను కాపాడేందుకు యత్నం

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేలా సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఽఆరోపించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామారావు హత్య కేసులో అసలు హంతకులను కాపాడేలా పోలీసులు కొత్త కథనం అల్లారని తెలిపారు. కేసులో 14 మంది సాక్షులను విచారించామని చెప్పినా, అందులో ఇద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వాళ్లంతా వేరే పేర్లు చెబుతున్నారని స్పష్టం చేశారు. అయినప్పటికీ సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ తప్పుడు కథనాలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. అసలైన హంతకులను శిక్షించే వరకు సీపీఎం పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో హత్యారాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు సీపీఎం శ్రేణులు ముగ్గురిని హత్య చేశారని చెప్పారు. అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించినందుకే రామారావును సైతం హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్‌ ప్రకారమే అంతా జరుగుతున్నా, అది ఎన్నో రోజులు సాగదని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్‌, బండి పద్మ, కళ్యాణం వేంకటేశ్వరరావు, మాదినేని రమేష్‌, వై.విక్రమ్‌, చింతలచెర్వు కోటేశ్వరరావు, ఎం.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement