రఘునాథపాలెం: ఉపాధి కోసం వచ్చి గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయిన ఏపీలోని కృష్ణా జిల్లా వాసికి చిమ్మపూడి గ్రామస్తులు అండగా నిలిచారు. సుతారీ పని ఇప్పిస్తానని నమ్మించిన ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన అనపర్తి శ్రీనివాస్‌ను బైక్‌పై తీసుకొచ్చి మార్గమధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నడుస్తూ చిమ్మపూడి చేరుకున్న ఆయనకు స్థానికులు సచ్చు నాగేశ్వరరావు, రాచర్ల సైదులు భోజనం ఏర్పాటుచేశారు. ఆతర్వాత మార్కెట్ మాజీ డైరెక్టర్ గుండ్ల ముత్తయ్యకు తెలియడంతో రైలు టికెట్ కొనుగోలు చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులకు నగదు, భోజనం అందించి శ్రీనివాస్‌ను స్వగ్రామానికి పంపించారు.
హత్యాయత్నంపై
కేసు నమోదు
రఘునాథపాలెం: భూవివాదం నేపథ్యాన ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన వేపకుంట్ల రెవెన్యూ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం బోడియా తండాకు చెందిన భద్రుకు రఘునాథపాలెం మండలం వేపకుంట్ల రెవె న్యూ పరిధి సర్వే నంబర్ 14లో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గతంలో ఆయనకు బంధువులైన లచ్చు, వీరన్నతో వివాదాలు జరిగాయి. ఈక్రమాన గురువారం భద్రు పొలంలో పనిచేస్తుండగా లచ్చు, వీరన్న గడ్డపార, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈమేరకు ఘటనపై ఆయన కుమారుడు వీరన్న ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం పోలీసులు తెలిపారు.


