సోలార్‌ ప్లాంట్‌కు 6.10 ఎకరాల భూమి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్‌కు 6.10 ఎకరాల భూమి

Oct 30 2026 12:21 AM | Updated on Oct 30 2026 12:21 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాస్థాయి అండర్‌–17 బాలబాలికల అథ్లెటిక్స్‌ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.చిన్ని తెలిపారు. తొలుత ఈ పోటీలను ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో నిర్వహించాలని భావించినా, వేదికను కల్లూరు మినీ స్టేడియంకు మార్చామని పేర్కొన్నారు. అలాగే, అండర్‌–14 బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నవంబర్‌ 1న కల్లూరు మినీ స్టేడియంలో జరుగుతాయని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గురువారం అప్పగించారు. ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యాన ఈ ప్లాంట్‌ ఏర్పాటుచేయనుండగా 6.10 ఎకరాల ప్రభుత్వ స్థలం పత్రాలను ఏఈ నారాయణరావుకు సర్పంచ్‌ దండా రంగయ్య అందజేశారు. జీపీఓ దామళ్ల జానకీరామయ్య, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

రేపు అండర్‌–17 అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌, వేదపండితుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు.

తుపాన్‌ నష్టంపై

ప్రాథమిక నివేదిక

కూసుమంచి: అర్బన్‌ తుపాన్‌తో జిల్లాలో జరిగిన పంట నష్టంపై ప్రాథమిక అంచనా రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. మండలంలోని కూసుమంచి, కిష్టాపురం గ్రామాల్లో నేలకొరిగిన పంటలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తుపాన్‌ ప్రభావంతో పలుచోట్ల వరి పొలాలు నేలవాలాయని తెలిపారు. ఈమేరకు రైతులు తగిన జాగ్రత్తలతో పంటలను కాపాడుకోవాలని సూచించారు. అలాగే, యాసంగిలో వరి, మొక్కజొన్న కాకుండా తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగయ్యే అపరాలు, నూనెగింజల పంటలు ఎంచుకోవాలని తెలిపా రు. కూసుమంచి ఏడీఏ రాజేష్‌, ఏఓ రామడుగు వాణి, ఏఈఓ జానీబాబా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement