అదరగొట్టిన చిన్నారులు ! | - | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన చిన్నారులు !

Oct 30 2026 12:21 AM | Updated on Oct 30 2026 12:21 AM

ఖమ్మంసహకారనగర్‌: చట్టసభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించే తీరుతో హావభావాలు, వాగ్దాటితో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు తోడు మార్షల్స్‌గా విద్యార్థులు వ్యవహరించిన మాక్‌ పార్లమెంట్‌ను ఖమ్మంలోని జిల్లా పరిషత్‌ సమావేశ హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డి.వాసంతి మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమం ఏటా రెండు, మూడు సార్లు నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు చట్టసభలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. అలాగే, జిల్లా పరిషత్‌ సీఈఓ దీక్షారైనా కూడా కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

ఉత్సాహంగా మాక్‌ పార్లమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement