ఖమ్మంవ్యవసాయం: అర్నబ్ తుపాన్ నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి తీసుకొచ్చిన పంటలు తడవకుండా మార్కెట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ చొరవతో బుధవారం నూతన మిర్చి యార్డులోని షెడ్లలో క్రయవిక్రయాలు నిర్వహించారు. ఇప్పటికే షెడ్ల నిర్మాణ పనులు పూర్తవడంతో, కొద్ది రోజులుగా మిర్చి కొనుగోళ్లు నూతన మార్కెట్‌లోని ఆరో నంబర్ షెడ్‌లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరో షెడ్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. కాగా, సోమవారం మిర్చి 300కు పైగా శాంపిళ్లతో పాటు ఆరు వేల బస్తాల పత్తిని రైతులు తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాకు జెండాపాటలో రికార్డుల స్థాయిలో రూ.23,525 పలకగా, పత్తికి గరిష్టంగా రూ.9వేల ధర పలికింది. ఇక పెసర తదితర పంటల విక్రయాలు యథావిధిగా పత్తి యార్డులోని షెడ్‌లోనే సాగించారు.
నేడు, రేపు కొనుగోళ్లకు బ్రేక్
తుపాన్ నేపథ్యాన రెండు రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల కొనుగోళ్లు నిలిపివేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు నిర్ణయించారు. ఈమేరకు మార్కెట్ కమిటీకి లేఖ ఇచ్చారు. తుపాన్ నేపథ్యాన నెలకొన్న వాతావరణంతో కొనుగోళ్లు, రవాణా ఇబ్బంది మారినందున గురు, శుక్రవారం పంట కొనుగోలు చేయలేమని తెలిపారు.
వర్షం నేపథ్యాన అధికారుల నిర్ణయం


