ఖమ్మంలీగల్: ఖమ్మం శుక్రవారిపేటకు చెందిన షేక్ ఖాజామియా రూ.24 లక్షలకు గాను సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం దివాలా పిటీషన్(ఐపీ) దాఖలు చేశారు. వివిధ వ్యాపారాలు చేసిన తాను నష్టపోయానని పేర్కొన్నాడు. ఈమేరకు 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా పిటీషన్ దాఖలు చేశారు.
గంజాయి నిర్వీర్యం
తల్లాడ/సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 35 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 982.562 కేజీల గంజాయితోపాటు హాష్ ఆయిల్‌ను నిర్వీర్యం చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. తల్లాడ మండలం గోపాలపేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రాంగణంలో గంజాయి, హాష్ ఆయిల్‌ను నిర్వీర్యం చేయగా, వీటి విలువ రూ.4.91కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఆర్ఐ నరసింహారావు, ఎస్ఐ హారిక, సిబ్బంది పాల్గొన్నారు.


