ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యాన ఓటర్ల నమోదు ప్రక్రియను వేగంగా చేపట్టాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి విజయమే లక్ష్యంగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత మండల, గ్రామస్థాయి నాయకులు తీసుకోవాలని తెలిపారు. అలాగే, ఎల్‌నినో ప్రభావంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

కరువు మండలాలుగా ప్రకటించాలి

ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలోని చింతకాని, తిరుమలాయపాలెం మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జిల్లాలోని 17 మండలాలను కరువు జాబితాలో చేర్చినా, చింతకాని, తిరుమలాయపాలెంను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. వర్షాభావంతో పంటలు పండక రెండు మండలాల్లో రైతులు నష్టపోయిన నేపథ్యాన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ చూపాలని సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు.

కొనసాగుతున్న

వారోత్సవాలు

ఖమ్మంక్రైం: విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయం, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈమేరకు ఏసీబీ డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ శేఖర్‌ ఆయా శాఖల ఉద్యోగులతో అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ సేవలను నిష్పక్షపాతంగా, లంచాలకు తావు లేకుండా అందించాలని సూచించారు.

గంజాయి స్వాధీనం

ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్‌లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో ఎకై ్సజ్‌ స్టేషన్‌–1 పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ చిరంజీవి, ఎస్‌ఐ రేష్మాసుల్తానా ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరికి చెందిన కుషాకై లో, కుషాముదలి అనుమానాస్పదంగా కనిపించారు. వీరి బ్యాగ్‌ల్లో పరిశీలిస్తే 2.295కిలోల గంజాయి లభించింది. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు వీరబాబు, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, వెంకన్న, అమలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement