ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

ఖమ్మంవైరారోడ్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన ఓటర్ల నమోదును బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఓటర్ల నమో దు కేంద్రాలను మంగళవారం ఆయన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులను కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. గత ఎన్నికల వివరాల ఆధారంగా వారికి ఫోన్‌ చేయాలని చెప్పారు. అయినా స్పందించకపోతే నేరుగా కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలని చెప్పారు. గడువు సమీపిస్తున్నందున ప్రైవేట్‌ విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని పువ్వాడ సూచించారు. నాయకులు గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్‌, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, షేక్‌ మక్బుల్‌, పల్లా రోజ్‌లీనా, నాగండ్ల కోటేశ్వరరావు, బిక్కసాని జస్వంత్‌, పసుమర్తి రామ్మోహన్‌, మాటేటి నాగేశ్వరరావు, బత్తుల మురళి, మెంతుల శ్రీశైలం, తిరుమల్‌ రావు, కొత్త వెంకటేశ్వరరావు, మేకల సుగుణరావు, శేషు, రామ్మూర్తి, బోజెండ్ల రామ్మోహన్‌, పాలడుగు పాపారావు పాల్గొన్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement