ఖమ్మం జిల్లాలో 17, భద్రాద్రి జిల్లాలో
16 మండలాలు
సహాయక చర్యలకు
ఏర్పాట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో జలాశయాల్లో నీరు చేరక పంటల సాగు చతికిలపడింది. వరుణుడిపై నమ్మకంతో సాగు చేసిన పంటల దిగుబడి కూడా పడిపోయే పరిస్థితి నెలకొంది. అంతేకాక జలాశయాలు, భూగర్భజలాలు అడుగంటుతుండగా తాగునీటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈక్రమాన జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్రంలో 365 మండలాలతో జాబితా విడుదల చేయగా ఉమ్మడి జిల్లా నుంచి 33 మండలాలు ఉన్నాయి.
కరువు పరిస్థితులతో...
ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈనేపథ్యాన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అందిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాల జాబితా విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కాలంలో లోటు వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ జీఓ 3ను జారీ చేసింది. వర్షాభావ పరిస్థితుల తీవ్రత ఆధారంగా మండలాలను తీవ్ర కరువు, మధ్యస్త కరువు కింద వర్గీకరించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానుండగా, రాబోయే ఆరు నెలల పాటు ఈ జాబితా ఆధారంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సహాయక చర్యలకు సిద్ధం
కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యాన తదుపరి చర్యలకు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈమేరకు రైతులను ఆదుకునేందుకు పలు కీలక చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం, బూర్గంపాడు, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట.
ఇన్‌పుట్ సబ్సిడీ : అర్హులైన రైతులకు త్వరలోనే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబిటి) ద్వారా వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీని అందించనున్నారు.
రుణాల పునర్వ్యవస్థీకరణ : రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వ్యవసాయ రుణాలను పునర్వ్యవస్థీకరించేలా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో చర్చిస్తారు. ఇదే సమయాన బలవంతపు రుణ వసూళ్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
తాగునీరు, మేత సరఫరా : ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, పశువుల కోసం తగిన వసతులు, మేత ఏర్పాట్లు చేస్తారు.
ఉమ్మడి జిల్లాలోని
33 మండలాలతో జాబితా


