ఖమ్మంక్రైం: విధి నిర్వహణలో మృతి చెందిన ఎస్‌ఐ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మంగళవారం అందజేశారు. ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసిన డి.అనంతరాములు కుటుంబసభ్యులకు పోలీసు సిబ్బంది సంక్షేమ నిధి నుంచి మంజూరైన ఆర్థికసాయం చెక్కు అందజేశాక సీపీ మాట్లాడారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కళావతి, పోలీసు ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాఽథ్ పాల్గొన్నారు.
విధుల్లో బాధ్యతగా
వ్యవహరించాలి
రేక్ పాయింట్‌కు 1,319 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.22 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 519.22 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
నాణ్యమైన విద్య
అందించడమే లక్ష్యం
బోనకల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాప్రమాణాలను కొనసాగిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సూచించారు. మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం తనిఖీ చేసిన ఆమె విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. అలాగే, ముష్టికుంట్ల భవిత సెంటర్, ప్రీ–ప్రైమరీ తరగతులను కూడా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన డీఈఓ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు భాష, గణితంపై పట్టు సాధించేలా బోధించాలన్నారు. ఎంఈఓ దామాల పుల్లయ్య, మండల కోఆర్డినేటర్ మాధవరావు పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ టోర్నీ
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ జరగనుంది. ఈమేరకు వివిధ జిల్లాల జట్లు మంగళవారం రాత్రి సత్తుపల్లికి చేరుకున్నాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్, మువ్వా విజయ్ బాబు యూత్ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించే పోటీలకు రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు చేశారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యాన వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా జర్మన్ టెంట్‌తో పాటు సింథటిక్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. కాగా, ఏర్పాట్లను టీజీఐడీసీ మాజీ చైర్మన్ విజయ్‌బాబు పరిశీలించారు.


