చింతపల్లిలో కేంద్ర బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో కేంద్ర బృందం పర్యటన

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

ఖమ్మంరూరల్‌: మండలంలోని చింతపల్లి గ్రామంలో మంగళవారం కేంద్రబృందం సభ్యులు పర్యటించారు. ఇటీవల రాష్ట్రంలోని మూడు గ్రామపంచాయతీలు జాతీయ ఉత్తమ అవార్డుకు నామినేట్‌ కాగా, అందులో చింతపల్లి కూడా ఉంది. ఈమేరకు కేంద్ర జల నిర్వహణ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత బృందానికి స్థానిక మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం నీటి నిర్వహణకు చేపట్టిన పనులు, అందుబాటులో ఉన్న వనరులు, నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఆతర్వాత పంచాయతీ రికార్డులు, గ్రామంలో నీటి వినియోగం, గ్రామస్తుల భాగస్వామ్యం, దీర్ఘ కాలిక నీటి లభ్యత, పంచాయతీ తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. భూగర్భ నీటిమట్టం పెరుగుదల, డ్రెయినేజీ వ్యవస్థ, గ్రామంలో 274 ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయడంపై అభినందించారు. బృందంలో పినాకి తహబీల్‌దార్‌, నిషా బారి, షర్మామి ఉండగా, వీరి వెంట ఎంపీడీఓ రవికుమార్‌, ఎంపీఓ మణి, సర్పంచ్‌ ఆరెంపుల మరియమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement