కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే పత్తి చేనులోకి దూసుకెళ్లింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు... భద్రాచలం డిపోనకు చెందిన డీలక్స్ బస్సు హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తుండగా జాతీయ రహహదారిపై లింగారంతండా వద్ద అదుపు తప్పింది. దీంతో బస్సు రోడ్డు దిగి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ సమయాన కొందరే ప్రయాణికులు ఉండడం, వారు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సు అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.


