ఖమ్మంరూరల్: పారాక్వాట్ కలుపు మందుతో ఎదురయ్యే నష్టాలపై అవగాహన కల్పిస్తున్న మండల వాసి డాక్టర్ కన్నేటి సతీష్‌ను ఐఎంఏ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో సత్కరించారు. ఈసందర్భంగా సతీష్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు లభించడంతో బాధ్యతను మరింత పెరిగిందని తెలిపారు. పారాక్వాట్ నిషేధం కోసం ఖమ్మంలో మొదలైన అవగాహన కార్యక్రమం మంచిర్యాల, కరీంనగర్‌కు, ఆపై ఢిల్లీకి చేరిందని చెప్పారు. ఈ పోరాట ఫలితంగా దేశ వ్యాప్తంగా పారాక్వాట్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డితో పాటు వైద్యులు కె.రమేష్‌రెడ్డి, గంగాధర్, బి.రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


