మధిర పాత ఆస్పత్రిలో శిక్షణ కేంద్రం ? | - | Sakshi
Sakshi News home page

మధిర పాత ఆస్పత్రిలో శిక్షణ కేంద్రం ?

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

మధిరరూరల్‌: మధిరలో వంద పడకల ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాక మెయిన్‌ రోడ్డులోని పాత ప్రభుత్వ ఆస్పత్రి భవన సముదాయం ఖాళీగా ఉంటోంది. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. ఈమేరకు డీఎంహెచ్‌ఓ బి.రామారావు సోమవారం పరిశీలించారు. గదుల్లో వసతులు, స్థల లభ్యతపై ఆరా తీశారు. తొలుత మధిరలోని పలు మెడికల్‌ ల్యాబ్‌లను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఇటీవల పలు ల్యాబ్‌ల్లో ఇచ్చిన నివేదికల్లో తేడా వస్తోందని ఆరోపణలు రావడంతో ఆయన తనిఖీ చేసినట్లు సమాచారం. ఈసందర్భంగా రికార్డులు, పరికరాలు, రక్తపరీక్షలకు వినియోగించే రసాయనాల పరిశీలించారు. అర్హత కలిగిన సిబ్బందిని నియమించడంతో పాటు రక్తపరీక్షలు కచ్చితత్వంతో చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌గౌడ్‌, పాల్గొన్నారు.

కేయూ బ్యాడ్మింటన్‌

జట్టులో స్థానం

ఖమ్మం స్పోర్ట్‌: ఖమ్మంలోని కవిత మెమోరియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎస్‌.కే. షాహిన్‌ బేగం కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ మహిళల జట్టులో స్థానం దక్కించుకుంది. బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె ఈనెల 18 నుంచి కర్ణాటక రాష్ట్రం హుబ్లీలోని కేఎల్‌ఈ యూనివర్సిటీలో జరిగే దక్షిణ భారత బ్యాడ్మింటన్‌ చాంపియన షిప్‌ పోటీల్లో పాల్గొననుండగా, మంగళవారం మొదలయ్యే కోచింగ్‌ కోచింగ్‌ క్యాంప్‌నకు హాజరుకానుంది. విద్యార్థిని షాహిన్‌ బేగంను కళాశాల కరస్పాండెంట్‌, సెక్రటరీ కోట అప్పిరెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వీ.రమణరావు, పీడీ జె.ఉపేందర్‌ అభినందించారు.

కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ సూచించారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 26వరకు ఫీజు చెల్లించవచ్చని, రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 30వరకు గడువు ఉందని తెలిపారు. కోర్సుల వారీగా ఫీజుల వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించాలని పేర్కొన్నారు.

ఎకై ్సజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీగా రమేష్‌గౌడ్‌

కాజీపేట అర్బన్‌: ఎకై ్సజ్‌ శాఖ హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల సెంట్రల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా ముత్యాల రమేష్‌గౌడ్‌ ఎన్నికయ్యారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌ను జోన్‌–4లోని అధికారులు, ఉద్యోగులు అభినందించారు.

రేక్‌ పాయింట్‌కు

కాంప్లెక్స్‌ ఎరువులు

చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు సోమవారం ఫ్యాక్ట్‌ కంపెనీకి చెందిన 1,338.750 మెట్రిక్‌ టన్నుల 15–15–15 కాంప్లెక్స్‌ ఎరువులు చేరాయి. వీటిని కోటా వారీగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు పంపిణీ చేసినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్ల య్య తెలిపారు.

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశానికి 13వరకు అవకాశం

సత్తుపల్లి: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డ్రిగ్రీ ప్రవేశాలకు ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని సత్తుపల్లి జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌ డాక్టర్‌ చీపు పూర్ణచంద్రరావు తెలిపారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఓపెన్‌ ఇంటర్‌, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. ఎస్‌టీ కోయ, చెంచు, గోండు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య అందుతుందని తెలిపారు. కాగా, డిగ్రీ రెండు, మూడో సంవత్సరం అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని సూచించారు.

షార్ట్‌సర్క్యూట్‌తో

దగ్ధమైన వాహనం

వైరారూరల్‌: వైరాలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సోమవారం బొలేరో వాహనం దగ్ధమైంది. మండలంలోని కొండకొడిమకు చెందిన వీరబాబు తన వాహనంతో వైరా వచ్చి శ్రీనివాస థియేటర్‌ వద్ద ఆపాడు. పని ముగిశాక వాహనం స్టార్ట్‌ చేసే ప్రయత్నంలో ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి ముందు భాగాన మంటలు మొదలై వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై వీరబాబు కిందకు దిగగా మంటలు మరింత విస్తరించాయి. ఈమేరకు ఎస్సై పుష్పాల రామారావు చేరుకుని అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement