ఉన్నతాధికారులతో మాట్లాడిన
ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంరూరల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్ వాసి సుప్రియ మృతిపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా రాష్ట్రప్రభుత్వ సహకారం కోసం విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్(పీఓఈ) ఉన్నతాధికారులు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అంతేకాక సుప్రియ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కాగా, సుప్రియ మృతిపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన కుటుంబీకులను సంతాపం తెలిపారు. ఈమేరకు మంత్రి సూచనలతో సింహాద్రినగర్‌లో సుప్రియ కుటుంబీకులను మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్‌చైర్మన్ తమ్మినేని నవీన్, నాయకులు బానోత్ కిషోర్, గరికపాటి ఆంజనేయప్రసాద్ పరామర్శించారు.
ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పరామర్శ
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింహాద్రి నగర్‌కు చెందిన సుప్రియ మృతిపై ఎంపీ రవిచంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబీకులను సోమవారం ఆయన ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు.


