పంచాయతీ భవన నిర్మాణంలో వివాదం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ భవన నిర్మాణంలో వివాదం

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

నేలకొండపల్లి: మండలంలోని పైనంపల్లి గ్రామపంచాయతీ భవనం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు పహారా ఉన్నా కొందరు అడ్డుకున్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు కాగా, పీర్లచావిడి వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే, స్థలం తమదని ముస్లింలు అభ్యంతరం చెబుతున్నారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్‌ రాంప్రసాద్‌, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, పీఆర్‌ ఏఈ ప్రసాద్‌, సర్పంచ్‌ నరేష్‌ సమక్షాన శంకుస్థాపనకు యత్నించగా స్థానిక ముస్లింలు అడ్డుకోగా, తోపులాట నడుమే పూర్తిచేశారు. దీంతో ఆగ్రహించిన ముస్లింలు పీర్లచావిడి నుంచి సర్పంచ్‌ నివాసం వరకు ర్యాలీకి సిద్ధమవుతుండగా ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బందితో వెళ్లి చర్చించారు. ఈమేరకు పీర్ల చావిడి వద్ద పనులను ముస్లింలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో పనులను అడ్డుకుంటామని ముస్లింలు... అక్కడే కడతామని పంచాయతీ పాలకవర్గం చెడుతుండడం ప్రతిష్టంభనకు దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement