అభివృద్ధి నిరంతర ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● రూ.12.89 కోట్ల పనులకు శంకుస్థాపన

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● రూ.12.89 కోట్ల పనులకు శంకుస్థాపన

ఎర్రుపాలెం: ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల, ఎర్రుపాలెం, రామాపురం గ్రామాల్లో ఆదివారం ఆయన రూ.12.89 కోట్ల విలువైన పనులకు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం మెరుగుపడితే ప్రజలతో పాటు రైతుల ఇబ్బందులు తీరతాయని తెలిపారు. ఈమేర కు ప్రధాన రహదారులపై పాటు గ్రామీణ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించామని చెప్పారు. కాగా, రూ.5.65 కోట్లతో నిర్మించే మండలకేంద్రంలోని రింగ్‌ సెంటర్‌–జయంతి రోడ్డు, రెడ్డిపాలెంలో రూ.55లక్షలు, రామాపురంలో రూ.13లక్షలు, రేమిడిచర్లలో రూ.71లక్షల నిధులతో చేపట్టే అంతర్గత సీసీ రోడ్లతో పాటు ,రూ.6.5 కోట్ల వ్యయంతో రామాపురం నుంచి కొత్తపాలెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఎన్‌టీఆర్‌, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, మండల కేంద్రంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ కల్పించాలని స్థానికులు పలువురు డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement