ఖమ్మంక్రైం: అప్పటివరకు తల్లి ఒడిలో ఆడుకున్న బాలుడు.. బయటకు వెళ్లి అలాగే తిరిగి రాని లోకా లకు వెళ్లిపోయాడు. ఇంటి నిర్మాణానికి తవ్వించిన సంప్‌లో పడి నీట మునిగి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన సోమారపు సాయి కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య ఉమ, కుమారు డు గగన్(4) ఉండగా, రెండునెలల క్రితం కుమా ర్తె పుట్టింది. ప్రసవం కోసం ఉమ పుట్టినిల్లయిన ఖమ్మం ప్రకాష్‌నగర్ కుమ్మరి బజార్‌కు రాగా, అంతకుముందే తండ్రి అంజయ్య మృతి చెందడంతో తల్లి రజినికి తోడుగా ఇక్కడే ఉంది. రోజు లాగే గగన్ ఆదివారం ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. వీరి ఇంటి పక్కనే ఆటోడ్రైవర్ సురేష్ ఇంటి నిర్మాణంలో భాగంగా సంపు తవ్వించగా అది నీటితో నిండింది. గగన్ ప్రమాదవశాత్తు సంపులో పడగా ఎవరూ చూడకపోవడంతో నీట మునిగి మృతిచెందా డు. అయితే, బాలుడు ఎంతకూ రాకపోవడంతో తల్లి ఉమ వెతుకుతూ నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు రాగా నీటిలో తేలియాడుతూ గగన్ కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంపు నిండా నీళ్లు ఉన్నా కప్పు ఏర్పాటు చేయని సురేష్‌పై స్థానికులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిని ఖమ్మం త్రీటౌన్ సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ కొండల్‌రావు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇంటి సంపులో పడి చిన్నారి మృతి


