‘శాంతినగర్‌’ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

‘శాంతినగర్‌’ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని శాంతినగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలను వచ్చే నెల29న ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు పూర్వ విద్యార్థులు వెల్లడించారు. పాఠశాలలో హెచ్‌ఎం చల్లగాని కృపాబాలానందం అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై చర్చించి వివిధ కమిటీలను ఏర్పాటు చేయడమే కాక దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఉత్సవాల సందర్భంగా సమీకరించే వనరులను పాఠశాల అభివృద్ధికి వినియోగించడంపై చర్చించారు. పూర్వ ప్రధానోపాధ్యాయులు చెరుకూరి కృష్ణకుమారి, బాబూరావు, ఉపాధ్యాయులు రాజు, కృష్ణమోహన్‌, పూర్వ విద్యార్థులు బోగా గిరి, బ్రహ్మారెడ్డి, నాగభూషణం, సత్యానందం, కొప్పు నరేష్‌, గార్లపాటి నాగేశ్వరరావు, వడ్డెల్లి కృష్ణమూర్తి, చావా వెంకటేశ్వర్లు, కె.మార్క్‌, ఆదిశేషు, ఆమంచి సురేష్‌, యాదగిరి, చావా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పోస్టాఫీసుల్లో

గంగాజలం!

ఖమ్మంగాంధీచౌక్‌: పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగించే గంగా జలాన్ని పోస్టాఫీసుల ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గంగోత్రి, రిషికేష్‌ ప్రాంతాల్లో సేకరించిన జలాన్ని ‘గంగాజల్‌ సేవలు’ పథకం ద్వారా సీసాల్లో నింపి విక్రయిస్తున్నారు. ఈ నీరు తాగడానికి ఉద్దేశించినది కాదని, పూజలు, ఆధ్యాత్మిక క్రతువులకే ఉపయోగించాలని బాటిళ్లపై సూచనలు నమోదు చేశారు. జిల్లాలోని పోస్టాఫీసుల్లో 250 మి.లీ. సీసా రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనైతే కనీసం నాలుగు బాటిళ్ల ప్యాక్‌ ఆర్డర్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

పొక్లెయినర్‌

డ్రైవర్‌ మృతి

కల్లూరు రూరల్‌: కల్లూరు మండలం వెన్నవెల్లి గుట్ట వద్ద మట్టి తవ్వుతుండగా పైభాగం కూలడంతో గల్లంతైన పొక్లెయినర్‌ డ్రైవర్‌ మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. గుట్ట వద్ద సొరంగ మార్గంలో శనివారం సాయంత్రం మట్టి తవ్వుతుండగా ఇటీవల వర్షాలకు నాని ఉండడంతో ఆకస్మాత్తుగా మట్టి పెళ్లలు కూలిపడ్డాయి. దీంతో డ్రైవర్‌ తేలూరి రవి(45)తో పాటు వాహనం మట్టిలో కూరుకుపోయింది. ఈమేరకు తవ్వకాలు చేపట్టగా ఆదివారం ఆయన మృతదేహం బయటపడింది. మట్టిలో కూరుకుపోయి ఊపిరి ఆడక రవి మృతి చెందినట్లు భావిస్తుండగా, ఆయన భార్య తేల్లూరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు. కాగా, రవి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం కాగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement