సీఎంఆర్‌ఎఫ్‌ పేరుతో వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ పేరుతో వసూళ్లు

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● మంజూరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ● ఖమ్మం నియోజకవర్గం బూడిదంపాడులో ఘటన

● మంజూరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ● ఖమ్మం నియోజకవర్గం బూడిదంపాడులో ఘటన

రఘునాథపాలెం: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) పథకం ద్వారా సాయం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి డబ్బు వసూలు చేసినట్లు బయటపడింది. వ్య వసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన ఒక ఆర్‌ఎంపీ గతంలో ఖమ్మంలో ఆస్పత్రిని ఏర్పాటుచేయగా అధికారులు సీజ్‌చేశారు. ఆపై సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇప్పిస్తానంటూ అనారోగ్యానికి గురైన పలువురిని సంప్రదించడమే కాక ఖర్చుల పేరిట రూ.10వేల నుంచి రూ.30వేల మేర వసూలు చేసినట్లు సమాచారం. అయితే, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆస్పత్రుల పేరిట ఆయన బిల్లులు ఇవ్వడంతో వారి దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఈమేరకు డబ్బులు పోగా, సాయం కూడా అందక బాధితులు లబోదిబోమంటున్నారు. కాగా, బూడిదంపాడు ఖమ్మం ఆత్మ కమిటీ చైర్మన్‌ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు స్వగ్రామం కావడంతో ఆయన బాధితుల తరఫున ఆదివారం ఆర్‌ఎంపీతో మాట్లాడి పైకం చెల్లించాలని సూచిస్తే నిరాకరించినట్లు తెలిసింది.

ఇంకొన్ని మండలాల్లో కూడా..

బూడిదంపాడుకు చెందిన కాకనబోయిన వెంకట నారాయణ, వరికోలు నాగలక్ష్మి, గోళ్ల గురవయ్య, వీరభద్రం, దేశాయి కృష్ణవేణి, సిలివేరు మౌనిక, దేవరపల్లి కొసల, మెట్ల మంగమ్మ తదితరల నుంచి రూ.10వేలు మొదలు రూ.30వేల మేరవసూలు చేసి న సదరు ఆర్‌ఎంపీ తిరిగి ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కాగా, సదరు ఆర్‌ఎంపీ ఈ గ్రామంలోనే కాక మరికొన్ని మండలాల్లోనూ డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement