ఎఫ్‌ఎంసీ రద్దుకు నివేదిక | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎంసీ రద్దుకు నివేదిక

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● కలెక్టర్‌కు లేఖ పంపించిన తహసీల్దార్‌ ● విచారణ చేస్తున్న మధిర పోలీసులు

● కలెక్టర్‌కు లేఖ పంపించిన తహసీల్దార్‌ ● విచారణ చేస్తున్న మధిర పోలీసులు

మధిర: ఫోర్జరీ సంతకాలు, తప్పుడు ఆధారాలతో తీసుకున్న ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌ఎంసీ) రద్దుకు రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ‘మామ పింఛన్‌ కోసం కోడలి పన్నాగం’శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఎఫ్‌ఎంసీ రద్దు కోసం కలెక్టర్‌కు ప్రతిపాదించారు. రిటైర్డ్‌ టీచర్‌, స్వాతంత్య్ర సమరయోధుడు నల్లగట్ల సీతారామయ్య 2025 మే 26న మృతి చెందగా, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం మీసేవాకేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 23న దరఖాస్తు చేయడంతో రెవెన్యూ అధికారులు మార్చి 2న జారీచేశారు. అయితే, సీతారామయ్య పింఛన్‌ కోసం ఆయన కోడలు త్రివేణి తప్పుడు ఆధారాలతో కుమార్తెగా చెబుతూ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేయడం, త్వరగా సర్టిఫికెట్‌ జారీ చేసేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పీఏ అంటూ త్రివేణి కుమారుడు తహసీల్దార్‌ రాంబాబు, ఆర్డీఓ శ్రీని వాస్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఆపై త్రివేణి అన్‌ మ్యారిడ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశాక అధికారుల విచారణలో విషయం బయటపడింది. ఈమేరకు ఆరా తీస్తే కేంద్రమంత్రి పీఏ పేరిట త్రివేణి కుమారుడే ఆమె మామ నంబర్‌తో ఫోన్‌ చేసినట్లు తేలింది. కాగా, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయడానికి నెలలోపైతే తహసీల్దార్‌కు అధికారం ఉంటుందని, కానీ ఏడు నెలలు కావడంతో కలెక్టర్‌ దివాకరకు తహసీల్దార్‌ రాంబాబు నివేదిక పంపించారు. అలా గే, సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తుపై సంతకాలు చేసిన గెజిటెడ్‌ అధికారులైన సబ్‌ ట్రెజరీ కార్యాలయ ఉద్యో గి, మరో ప్రభుత్వ ఉద్యోగితో పాటు అఫిడవిట్‌ ఇచ్చిన న్యాయవాది వివరణ కోరుతూ తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. అంతేకాక ఈ అంశంపై సీతారామయ్య పెద్ద కుమారుడు ఎన్‌వీఎస్‌.ప్రసాద్‌ ఫిర్యాదుతో మధిర టౌన్‌ సీఐ దోమల రమేష్‌ ఆధ్వర్యాన విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement