రఘునాథపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సిద్దిపేటకు చెందిన అంతటి రాజయ్య(48)కు జేసీబీ ఉండగా మూడేళ్లుగా ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాకకు చెందిన రవీందర్‌రాజు ద్వారా ఇక్కడే దాన్నినడిపిస్తున్నాడు. లావాదేవీలు చూసేందుకు రాజయ్య సెప్టెంబర్ 19న కారులో వస్తుండగా రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం శివారులో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి న గేదెను తప్పించే క్రమాన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం సిద్దిపేటకు, ఆతర్వాత హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. ఆయ న భార్యరేనా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేశారు.
మున్నేరులో వ్యక్తి మృతదేహం
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కరుణగిరి సమీపాన మున్నేటిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన చీపు రవి(30) ఎనిమిదేళ్లుగా భార్య బాలప్రయతో కలిసి ఖమ్మం వీడీవోస్ కాలనీలో ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేసే ఆయన బైక్ శనివారం సాయంత్రం మున్నేటి ఒడ్డున ఉందని పోలీసులు రవి సోదరుడు నరేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ వెతుకుతుండగా ఆదివారం మృతదేహం బయటపడింది. ఆర్థిక ఇబ్బందులతో రవి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


