‘పెట్టుబడిదారులకు సేవ చేస్తున్న పాలకులు’ | - | Sakshi
Sakshi News home page

‘పెట్టుబడిదారులకు సేవ చేస్తున్న పాలకులు’

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

ఖమ్మం అర్బన్‌: దేశంలో పాలకులు పెట్టుబడిదారీ వర్గాలకు సేవ చేస్తూ ప్రజలను మాత్రం దోపిడీ చేస్తున్నారని మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య ఆరోపించారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం కై కొండాయిగూడెంలో ఆదివారం పీవైఎల్‌ జిల్లా రాజకీయ తరగతులు నిర్వహించగా, జిల్లా అధ్యక్షుడు జె.ప్రేమ్‌సింగ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ప్రజలపై ప్రభుత్వం అర్బన్‌ నక్సలైట్లుగా ముద్ర వేస్తోందని విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే హామీని విస్మరించిన నేపథ్యాన సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలపై పీవైఎల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.ఎస్‌.ప్రదీప్‌ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వీ.రాకేష్‌, జిల్లా కార్యదర్శి భరత్‌ లెనిన్‌తో పాటు నాయకులు సుబ్బారావు, ప్రేమ్‌సింగ్‌, జె.భరత్‌, సీహెచ్‌.ధరణీకృష్ణ, రాపోలు కృష్ణ, తోట రమేష్‌, శ్రీనివాస్‌, మధు, వెంకటేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement