చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి లోని రేక్ పాయింట్‌కు శనివారం కోరమాండల్ కంపెనీకి చెందిన 2,639.52 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,339.52 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 700 మె. టన్నులు సరఫరా చేశారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు.
తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?
● ఉపాధ్యాయులకు నోటీసులపై విమర్శలు
పెనుబల్లి: పెనుబల్లి మండలం ఉప్పలచెలక ప్రాథమిక పాఠశాలలో ఇటీవల అల్పాహారం తిన్నాక ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అల్పాహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వైద్యులు వెల్లడించారు. ఈ అల్పాహారం మధిరలోని మెగా కిచెన్ నుంచి సరఫరా అయిన విషయాన్ని విస్మరించి సంబంధం లేని ఉపాధ్యాయులకు నోటీసులు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండా తీసుకున్న ఈ చర్యపై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కాగా, ఘటన జరిగిన హెచ్‌ఎం సెలవులో ఉన్నా ఆమెకు నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
నేడు సెపక్‌తక్రా
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల సెపక్‌తక్రా జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.మధు తెలిపారు. ఖమ్మంలోని యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యూకేషన్ కళాశాలలో జరిగే పోటీలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 98490 54733 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
ఎయిడ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎయిడ్స్ నియంంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో శనివారం పర్యటించిన ఆమె డీఎంహెచ్‌ఓ రామారావుతో కలిసి జనరల్ ఆస్పత్రిలోని ఎయిడ్స్ విభాగాన్ని పరిశీలించారు. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వైద్యపరీక్షలు, బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశాక సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జవాబుపత్రాల
మూల్యాంకనం ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎస్–1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి నుంచి ఎక్కడికక్కడ కాకుండా అన్ని పాఠశాలల విద్యార్థులు జవాబుపత్రాలను జంబ్లింగ్ విధానంలో మూల్యాంకనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాంగా 9వ తరగతి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీసీఈబీ సెక్రటరి కనపర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీ్త్రనిధి రుణాల రికవరీపై దృష్టి
పెనుబల్లి: గత పదేళ్లుగా సీ్త్రనిధి, మహిళా సంఘా ల రుణాలు పెండింగ్‌లో ఉన్నందున, రికవరీపై ఉద్యోగులు దృష్టి సారించాలని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్ సూచించారు. పెనుబల్లి సీ్త్ర భక్తి భవనంలో శనివారం ఆయన సీసీలు, వీఓలతో సమావేశమయ్యారు. మండలంలో సంఘాల వారీగా బకాయిలపై సమీక్షించిన ఆయన మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని రికవరీ చేయాలని తెలిపారు. డీపీఎం ఆంజనేయులు, ఏపీఓ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.


